Ahan Shetty: సునీల్ శెట్టి తనయుడు హీరోగా హిందీ 'ఆర్ ఎక్స్ 100'

  • తెలుగులో హిట్ కొట్టిన 'ఆర్ ఎక్స్ 100'
  • మిలన్ లుథ్రియా దర్శకత్వంలో హిందీ రీమేక్ 
  • అహన్ శెట్టి సరసన తారా సుతారియా    

బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రవేశాడు. సరైన కథతో తన తనయుడు అహన్ శెట్టిని హీరోగా పరిచయం చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన అనుకున్న కథ దొరకడంతో ఈ రోజున ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు.

ఇంతకీ అహన్ శెట్టి చేసే సినిమా .. 'ఆర్ ఎక్స్ 100' రీమేక్. తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని అందుకుంది. రొమాన్స్ తో కూడిన ఈ యాక్షన్ మూవీ యూత్ కి విపరీతంగా నచ్చేసింది. అందుకే సునీల్ శెట్టి ఈ కథను ఎంచుకున్నట్టుగా సమాచారం. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, అహన్ శెట్టి జోడీగా తారా సుతారియా నటిస్తోంది.

  • Loading...

More Telugu News