Tamannaah Simhadri: హీరోయిన్ తమన్నాకు కష్టాలు తెచ్చి పెట్టిన 'బిగ్ బాస్ తమన్నా'!

  • టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్
  • వైల్డ్ కార్డ్ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా ఎంట్రీ
  • తమన్నాను విమర్శిస్తుంటే అవన్నీ హీరోయిన్ ఖాతాకు

తానేమీ తప్పు చేయకున్నా సోషల్ మీడియాలో తనపై కామెంట్లు, విమర్శలు వస్తున్నాయని హీరోయిన్ తమన్నా ఇప్పుడు వాపోతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం టాలీవుడ్ రియాల్టీ షో 'బిగ్ బాస్'లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరయిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఆమె ఆట ఎలావున్నా, తన మాటలు, చేతలతో కావాల్సినంత పేరు తెచ్చుకుంది.

ఇక ఆమెను ట్యాగ్ చేస్తూ, వేలాది నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో, అవన్నీ హీరోయిన్ తమన్నాకు చేరుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో తమన్నాను అంటున్నామన్న ఉద్దేశంతో నెటిజన్లు చేస్తున్న విమర్శలు తనకు వస్తున్నాయని తమన్నా వాపోతోంది. ఇక, ఆమె హౌస్ లో కొనసాగినంతకాలం మీకు ఇబ్బందులు తప్పవంటూ హీరోయిన్ తమన్నాను కొందరు ఊరడిస్తున్నారు.

Tamannaah Simhadri
Biggboss
Tollywood
Heroine Tamannaah
Social Media
  • Loading...

More Telugu News