KCR: హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు చాపర్ లో బయలుదేరిన కేసీఆర్
- గోదావరి నీటిని పరిశీలించనున్న కేసీఆర్
- ఈ సీజన్ లో గోదావరికి భారీ వరద
- 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకే
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఈ వర్షాకాల సీజన్ లో గోదావరి నదిలోకి చేరిన నీటిని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మేడిగడ్డకు బయలుదేరారు. సుమారు 150 కిలోమీటర్లకు పైగా నదిని కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇదే సమయంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు.
ఈ వర్షాకాల సీజన్ లో సంతృప్తికరంగా వర్షాలు కురవగా గోదావరి నదికి భారీ వరద వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరదలో ఎక్కువభాగం సముద్రంలోనే కలుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతూ, సముద్రంలో కలిసిపోతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే మీదుగా నీరు ప్రవహిస్తోంది.