Nara Lokesh: 'అమ్మఒడి'ని సగం ముంచేసిన జగన్: నారా లోకేశ్

  • అమ్మఒడిని ఆంక్షల బడి చేశారు
  • 80 లక్షల మందిని 43 లక్షలకు కుదించారు
  • జగన్ తీరు మాటలు ఘనం, కోతలు సగం
  • ట్విట్టర్ లో నారా లోకేశ్

అమ్మఒడి పథకం లబ్దిదారులను ముఖ్యమంత్రి జగన్, పలు షరతులు పెట్టి సగానికి సగం చేశారని మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. "జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి  అమ్మఒడి ఇవ్వాలి. కానీ అసెంబ్లీకి  వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలు.. అంటే సగానికి సగం చేశారు. మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు" అని ఆయన మండిపడ్డారు.

అంతకముందు "మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చేసరికి  తెల్లకార్డు ఉన్నవారికే అని, పిల్లల్లో ఒకరికే అని అమ్మ ఒడిని కాస్తా 'ఆంక్షల బడి' చేశారు" అని నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో "అమ్మ ఒడి పథకంపై కూడా వైఎస్ జగన్ గారు తన మాట మార్చుడు.. మడమ తిప్పుడును యథేచ్ఛగా సాగించారు. ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకి రూ.15 వేలు సాయం అన్నారు. అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి అనగానే తడబడటం ప్రారంభించారు" అని ఎద్దేవా చేశారు. 

Nara Lokesh
Jagan
Twitter
Ammavodi
  • Loading...

More Telugu News