Gold: భగ్గుమన్న బంగారం ధర... పది గ్రాములు రూ. 37 వేలు!

  • అంతర్జాతీయ పరిణామాలతో ఆకాశానికి
  • బులియన్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్ల మొగ్గు
  • ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్ఠానికి ధర

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించిన తరువాత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ఈక్విటీల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరాయి.

భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 800 పెరిగి రూ. 36,970కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1000 పెరిగి రూ. 43,100కు చేరుకుంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ బలహీనపడటం కూడా బంగారం ధరను పెంచిందని బులియన్ పండితులు వ్యాఖ్యానించారు.

ఇక ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఫ్యూచర్స్ మార్కెట్ విషయానికి వస్తే, బంగారం, వెండి ధరలు 2 శాతం పెరిగి (అక్టోబర్ డెలివరీ) వరుసగా రూ. 36,977, రూ. 42,439కి చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో సైతం బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి, ఔన్సు బంగారం ధర 1,459 డాలర్లకు చేరింది.

  • Loading...

More Telugu News