Jammu And Kashmir: కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు భారత ప్రభుత్వం పూనుకోవాలి: స్వరూపానంద

  • ఆర్టికల్ 370 రద్దుతో దేశ సమగ్రత 
  • జమ్ముకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసానికి దోహదం
  • దేశ అధికారిక ఆధ్మాత్మిక చిహ్నంగా ‘గోవు’ను ప్రకటించాలి

జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంపై విశాఖపట్టణంలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశ సమగ్రతకు, జమ్ముకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని అన్నారు.

 కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు భారత ప్రభుత్వం పూనుకుంటే కనుక శారదా పీఠం సహకరిస్తుందని చెప్పారు. రామజన్మభూమి, గో సంరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. భారతదేశ అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా ‘గోవు’ను ప్రకటించాలని, అలా చేస్తే, మోదీని అభినవ వివేకానందుడిగా హిందువులందరూ కీర్తిస్తారని వ్యాఖ్యానించారు. 

Jammu And Kashmir
Saraswathi shakthi
peetham
swamy
Swarupananda
PM
Modi
Amit Shah
  • Loading...

More Telugu News