Sharwanand: అప్పట్లో త్రివిక్రమ్ ను వేషాలు అడిగాను: హీరో శర్వానంద్

  • అవకాశాల కోసం త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్లాను
  •  హీరోగానే నాకు ఛాన్స్ ఇస్తానని ఆయన అన్నారు
  •  ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నానన్న శర్వానంద్    

శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన 'రణరంగం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి ప్రస్తావించాడు.

"త్రివిక్రమ్ గారు దర్శకుడు కాకముందు రచయితగా చాలా బిజీగా ఉండేవారు. ఆ సమయంలోనే నేను ఆయన దగ్గరికి వెళ్లాను. ఏదైనా వేషం వుంటే చెప్పమని అడిగాను. కేరక్టర్ ఆర్టిస్టుగానైనా చేస్తానని చెప్పాను. 'నీకు వేరే పాత్ర ఇవ్వను .. నువ్వు హీరోగానే సినిమా చేస్తాను' అని ఆయన నాతో అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో తెలియదుగానీ, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.

Sharwanand
kajal
kalyani priyadarshan
  • Loading...

More Telugu News