Ngarjuna: అంతకు మించిన హిట్ కొడతాను: నాగార్జున

  • 'మజిలీ'తో చైతూ హిట్ కొట్టాడు
  •  'ఓ బేబీ'తో సమంత సక్సెస్ సాధించింది
  •  ఈ నెల 9న నేను వస్తున్నానన్న నాగ్ 

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందింది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా నాగార్జున మాట్లాడుతూ .. "ఈ సినిమాకి నేను నిర్మాతను అయినప్పటికీ ఇంకా కొన్ని రోజులు షూటింగు జరిగితే బాగుండును కదా అనుకున్నాను. అంత సరదాగా షూటింగు జరిగిపోయింది.

ఈ సినిమా కోసం ఎవరికి వాళ్లు పూర్తిస్థాయిలో కష్టపడి బెటర్ అవుట్ పుట్ ఇచ్చారు. మొన్న వేసవికి మా పెద్దబ్బాయి 'మజిలీ'తో హిట్ కొట్టాడు. మా కోడలు సమంత 'ఓ బేబీ' సినిమాతో సక్సెస్ ను సాధించింది. ఈ నెల 9వ తేదీన 'మన్మథుడు 2'తో నేను వస్తున్నాను. ఆ రెండు సినిమాలకి మించిన హిట్ ను నేను కొడతాను. అలా నా కొడుక్కి .. కోడలికి షాక్ ఇవ్వబోతున్నాను" అంటూ నవ్వేశారు.

  • Loading...

More Telugu News