Article 370: ఆర్టికల్ 370, 35-A తొలగింపు పద్ధతి ప్రకారం చేయలేదు: కాంగ్రెస్ ఎంపీ చిదంబరం

  • బీజేపీ విద్వేషపూరిత ఆలోచన నుంచే ఈ బిల్లు పుట్టింది
  • ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుంది
  • 370 రద్దు ద్వారా నియంత్రించలేని శక్తులను నిద్ర లేపుతున్నారు

ఆర్టికల్ 370, 35-A తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం అన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచే ఈ బిల్లు పుట్టిందని, ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు.

370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమని అన్నారు. 370 రద్దు ద్వారా నియంత్రించలేని శక్తులను నిద్ర లేపుతున్నారని విమర్శించారు. 'ఈ విధానం మిగతా రాష్ట్రాల్లోనూ అనుసరించరని నమ్మకమేంటి? ఇలాగైతే రాష్ట్రాలను ముక్కలు చేయకుండా కేంద్రాన్ని ఎవరు ఆపగలరు? ఈరోజు నిర్ణయం అన్ని రాష్ట్రాలకూ తప్పుడు సంకేతాలు పంపుతుంది' అని అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్ ఒక రాష్ట్రంగా దేశంలో కలిసిందని, దాన్ని అలాగే ఉంచాలని కోరారు.  

Article 370
Congress
chidambaram
Rajyasabha
  • Loading...

More Telugu News