Jammu And Kashmir: కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్!

  • టీడీపీ మద్దతు పలుకుతోందన్న చంద్రబాబు
  • కశ్మీరీలు ప్రశాంతంగా జీవిస్తారని ఆశాభావం
  • కశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుందన్న నారా లోకేశ్

జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ స్వాగతించారు. ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ..‘ఆర్టికల్ 370ను రద్దుచేయాలన్న కేంద్రం నిర్ణయానికి టీడీపీ మద్దతు పలుకుతోంది. జమ్మూకశ్మీర్ ప్రజలంతా ప్రశాంతంగా, సౌభాగ్యంతో అలరారాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అధికరణ 370పై కేంద్రం నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కశ్మీరీలు ఇకపై ప్రశాంతంగా ఉంటారనీ, అక్కడ అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా’ అని చెప్పారు.

Jammu And Kashmir
ARTICLE 370
Telugudesam
Chandrababu
Nara Lokesh
Twitter
  • Loading...

More Telugu News