Andhra Pradesh: 'తెలుగుదేశం' అనూహ్య నిర్ణయం.. ‘ఆర్టికల్ 370’కి మద్దతు ప్రకటించిన టీడీపీ!

  • బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీ కనకమేడల
  • కశ్మీర్ ప్రజల ఇబ్బందులు దూరమవుతాయని వ్యాఖ్య
  • భారత ప్రజలతో సమానంగా అవకాశాలు లభిస్తాయని వెల్లడి

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పునర్విభజనకు సంబంధించిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. గత 60 సంవత్సరాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చిక్కులు దూరమవుతాయని చెప్పారు. తాజా నిర్ణయం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పొందుతున్న అవకాశాలను జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా పొందుతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.

Andhra Pradesh
Telugudesam
Jammu And Kashmir
Article 370
support
  • Loading...

More Telugu News