Jammu And Kashmir: ఆర్టికల్ 370ని రద్దు చేయడం చెల్లదు.. ఇందుకు రాష్ట్ర అసెంబ్లీ అనుమతి కావాల్సిందే!: ప్రశాంత్ భూషణ్
- రాష్ట్రాన్ని విభజించాలన్నా అనుమతి తీసుకోవాలి
- రాష్ట్రపతి ఉత్తర్వులతో మార్చేయడం కుదరదు
- ఢిల్లీలో మీడియాతో సీనియర్ న్యాయవాది
జమ్మూకశ్మీర్ ను రెండు ముక్కలు చేయడంతో పాటు ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుపట్టారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టాలంటే తొలుత ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆర్టికల్ 370లో సవరణల విషయంలోనూ అసెంబ్లీ అనుమతి తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ తో దీన్ని చేసేయలేమని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని తేల్చిచెప్పారు.