BJP: 370 అధికరణ రద్దును సమర్థిస్తున్నాం: బీఎస్పీ

  • బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లునూ వ్యతిరేకించమని స్పష్టీకరణ
  • సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీపై గుర్రు
  • అనూహ్యంగా మారిన వైఖరి

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు బీజేపీ ప్రవేశపెట్టే ఏ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలోని బీజేపీపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ అనూహ్యంగా బీజేపీకి మద్దతుగా నిలవడం పరిశీలకులనే ఆశ్చర్యపరుస్తోంది.

ఆ పార్టీ ఎంపీ సతీష్‌చంద్ర మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తున్నట్టు, అధికరణ 370, 35ఏ రద్దు చేస్తున్నట్టు అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ము కశ్మీర్‌ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్‌ను చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.

BJP
BSP
support on ksmir
  • Loading...

More Telugu News