Jammu And Kashmir: కశ్మీర్ కు విమానాల్లో అదనపు బలగాల తరలింపు.. దక్షిణ కశ్మీర్ లో కర్ఫ్యూ

  • జమ్ముకశ్మీర్ కు 8 వేల అదనపు బలగాల తరలింపు
  • సీ-17 విమానాల ద్వారా శ్రీనగర్ చేరుకున్న బలగాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్

ఇప్పటికే భద్రతా బలగాల వలయంలో ఉన్న జమ్ముకశ్మీర్ కు మరిన్ని అదనపు బలగాలను తరలించారు. 8 వేల ప్యారామిలిటరీ బలగాలను విమానాల ద్వారా అక్కడకు తరలించారు. జమ్ముకశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో, భారీ ఎత్తున బలగాలను అక్కడ మోహరింపజేస్తున్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 విమానాల ద్వారా అదనపు బలగాలను శ్రీనగర్ కు తరలించారు. ఇప్పటికే అక్కడ ఉన్న 35 వేల బలగాలకు ప్రస్తుత అదనపు బలగాలు తోడయ్యాయి. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దక్షిణ కశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు. జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Jammu And Kashmir
army
forces
Article 370
  • Loading...

More Telugu News