Balakrishna: దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా 'లాయర్ సాబ్'

  • హిందీలో హిట్ కొట్టిన 'పింక్'
  • తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ 
  • తెలుగు టైటిల్ గా 'లాయర్ సాబ్'

హిందీలో విజయవంతమైన 'పింక్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులను కొట్టేసింది. దాంతో సౌత్ లోని ఇతర భాషా చిత్రాల దర్శక నిర్మాతలను ఈ కంటెంట్ ఆకర్షించింది. వాళ్లంతా ఈ సినిమాను తమ భాషలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా 'నెర్కొండ పార్వాయి' పేరుతో నిర్మితమైంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పింక్' తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బాలకృష్ణతో ఈ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో దిల్ రాజు సంప్రదించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కోసం దిల్ రాజు 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News