Jammu And Kashmir: భారత్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన పాక్ మీడియా... హెడ్ లైన్లన్నీ ఇండియా వార్తలే

  • భారత ప్రభుత్వ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్
  • ఇండియా వార్తలపైనే ఫోకస్ చేసిన పాక్ మీడియా
  • భారత్, కశ్మీర్ వార్తలతో నిండిపోతున్న పాక్ మీడియా వెబ్ సైట్లు

జమ్ముకశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టింది. క్షణాల వ్యవధిలో మారిపోయిన పరిణామాలతో యావత్ భారతదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు, మన దాయాది దేశం పాకిస్థాన్ కూడా అన్ని విషయాలను పక్కన పెట్టేసి, భారత్ లో ఏం జరుగుతోందా? అనే ఉత్కంఠతో పరిశీలిస్తోంది. అక్కడి మీడియాలో భారత్ కు సంబంధించిన వార్తలే హెడ్ లైన్లలో నిండిపోతున్నాయి.

అక్కడి మీడియాలో వస్తున్న పలు కథనాలు ఇవే:

  • భారత్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ కు ఉన్న స్పెషల్ స్టేటస్ ను రద్దు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఇండియా.
  • గృహ నిర్బంధంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా.
  • కమ్యునికేషన్ వ్యవస్థను భారత ప్రభుత్వం కట్ చేయడంపై కశ్మీరీ ప్రజల స్పందన.
  • ఆర్టికల్ 35A ఏం చెబుతోంది?
  • కశ్మీర్ లో కర్ఫ్యూ వాతావరణం.
  • ఓటు బ్యాంకు కోసం ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలేస్తున్న మోదీ.
  • కశ్మీర్ లో ఇంటర్నెట్, సెల్ ఫోన్ సేవలను నిలిపివేసిన భారత్.
  • భారత ప్రభుత్వ వైఖరిని ఖండించిన ఇమ్రాన్ ఖాన్.
  • కశ్మీర్ వివాదం మధ్యవర్తిత్వంపై ట్రంప్ అనుకున్న దాని కంటే ముందే కలగజేసుకోవాలి: పరిశీలకులు.
  • భారత్ ఇబ్బందికర చర్యలతో ఉపఖండంలో పరిస్థితులు దిగజారుతాయి: నేషనల్ సెక్యూరిటీ కమిటీ.
  • ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి భారత్-పాక్ చర్చలు జరపాలి: ఐక్యరాజ్యసమితి.

Jammu And Kashmir
India
Pakistan
Media
  • Loading...

More Telugu News