Article 370: ‘ఆర్టికల్ 370’తో అసలు ఇబ్బంది ఏమిటి? ఎందుకు రద్దు చేస్తున్నారు?

  • జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న నిబంధన
  • చట్టాల అమలుకు రాష్ట్రపతి పాలన తప్పనిసరి
  • రద్దుకు బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కశ్మీర్ ను భారత్ లో విలీనం చేసేందుకు అప్పటి పాలకుడు రాజా హరిసింగ్ కొన్ని షరతులు పెట్టారు. అందుకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను చేర్చారు. దీనిప్రకారం జమ్మూకశ్మీర్ కు సంబంధించి రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ రంగాలపై భారత్ కు సర్వాధికారాలు సంక్రమిస్తాయి. మిగతా అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. జమ్మూకశ్మీర్ కు ప్రస్తుతం సొంత రాజ్యాంగం కూడా ఉంది.

  • రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని కశ్మీర్ లో అమలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా కావాలి

  • ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు.

  • జమ్మూకశ్మీర్ లో శాశ్వత నివాసానికి సంబంధించిన  నిబంధనల్ని నిర్వచించే ఆర్టికల్ 35A నిబంధన ఆర్టికల్ 370లో భాగమే. దీని ప్రకారం జమ్మూకశ్మీర్ లో ఇతర రాష్ట్రాల ప్రజలు భూములు, ఆస్తులు కొనలేరు.

  • ఆర్టికల్ 360 ద్వారా దేశమంతా ఆర్థిక అత్యవసర స్థితిని విధించవచ్చు. కానీ కశ్మీర్ లో మాత్రం అమలు చేయలేం. కేవలం విదేశీ దురాక్రమణ, యుద్ధం జరిగే పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేయొచ్చు. కానీ తాజా బిల్లుతో ఈ నిబంధనలన్నీ వీగిపోతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Article 370
Jammu And Kashmir
Amit Shah
Home minister
  • Loading...

More Telugu News