Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ కు సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతాం: అమిత్ షా

  • ఆర్టికల్ 370 రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అమిత్ షా
  • పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలన్న విపక్షాలు
  • అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్న అమిత్ షా

జమ్ముకశ్మీర్ కు పత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్యే బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ కు సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని తెలిపారు. అన్ని విషయాలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభలోని విపక్ష సభ్యులకే కాకుండా, జమ్ముకశ్మీర్ లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు సమాధానాలు చెబుతానని తెలిపారు.

Jammu And Kashmir
Article 370
Amit Shah
Rajya Sabha
  • Loading...

More Telugu News