army chief: ఆర్మీ చీఫ్ రాజస్థాన్ పర్యటన రద్దు...జమ్ముకశ్మీర్ టెన్షన్ ఎఫెక్ట్
- ఈరోజు జైసల్మేర్ వెళ్లాల్సి ఉన్న బిపిన్ రావత్
- ఆర్మీ ఇంటర్నేషనల్ స్కౌట్‌మాస్టర్స్ కాంపిటేషన్స్ కార్యక్రమం
- చివరి నిమిషంలో పర్యటన రద్దు
సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ టూర్‌ను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన అంశాలు, కశ్మీర్‌పై పార్లమెంటులో హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేయనున్నారన్న సమాచారం వచ్చింది. పరిస్థితులు క్షణక్షణం మారుతుండడం, కశ్మీర్‌లో కల్లోలం రేగే అవకాశం ఉందని భావిస్తుండడంతో శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్మీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జైసల్మేర్‌లో ఆర్మీ ఇంటర్నేషనల్ స్కౌట్‌మాస్టర్స్ కాంపిటేషన్స్ ను రావత్ ప్రారంభించాల్సి ఉంది.