Andhra Pradesh: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ లతో భేటీ!

  • విభజన హామీలపై కేంద్రానికి నివేదిక
  • కీలక ప్రాజెక్టులను పూర్తిచేయడంపై చర్చ
  • రెండ్రోజుల పాటు సాగనున్న పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న జగన్.. ఏపీ విభజన హామీలకు సంబంధించి కేంద్రం చేయాల్సిన సాయంపై నివేదిక అందించనున్నారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఏపీలోని కీలక ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయడంపై వారితో చర్చించనున్నారు.

మరోవైపు ఢిల్లీ టూర్ లో భాగంగా పోలవరం టెండర్ల రద్దు, విద్యుత్ పీపీఏలను రద్దుచేయడంపై జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏపీ హక్కుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ పార్లమెంటు సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండ్రోజుల పర్యటనను ముగించుకున్నాక జగన్ విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
New Delhi
Narendra Modi
Ram Nath Kovind
President Of India
two day tour
  • Loading...

More Telugu News