Ranveer Singh: తనలోని జంటిల్ మన్ ను బయటపెట్టిన రణ్‌ వీర్‌ సింగ్‌... వీడియో వైరల్!

  • ప్రస్తుతం లండన్ లో ఉన్న రణ్ వీర్
  • ఫ్యాన్స్ ను కలిసేందుకు టౌన్ హాల్ కు
  • ఓ వృద్ధురాలితో ఆప్యాయపు మాటలు

అభిమానులతో మమేకమై, వారితో కాసేపు గడపటాన్ని ఎంతో ఆనందంగా భావించే బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్, మరోసారి తనలోని విలక్షణతను బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా, నెటిజన్లు రణ్ వీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే, ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, సౌత్ హాల్ కు వెళ్లి, తన అభిమానులను కలిశాడు. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్, రణ్ వీర్ ను కలిసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. కానీ, రణ్ వీర్ మాత్రం, తనను చూసేందుకు వీల్ చైర్ లో వచ్చిన ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లాడు. ఓ రోజా పువ్వును ఇచ్చి, ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. ఆమె కూడా రణ్ వీర్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది.

ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, రణ్ వీర్ ఓ జంటిల్ మన్ లాంటివాడని, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

Ranveer Singh
London
Fans
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News