Jammu And Kashmir: అటు కేంద్రం...ఇటు విపక్షాలు: కశ్మీర్ టెన్షన్ నేపథ్యంలో పోటా పోటీ సమావేశాలు
- అజాద్ నేతృత్వంలో కలిసి చర్చించనున్న నేతలు
- కాంగ్రెస్ నేత చాంబర్‌లోనే సమావేశం
- కశ్మీర్ అంశంపైనే ప్రధానంగా చర్చ
దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రాజకీయ వ్యూహాలన్నీ జమ్ముకశ్మీర్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రం విషయం చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై చర్చించగా, అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత, సరిహద్దు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ అజాద్ ఆధ్వర్యంలో విపక్ష నాయకులు సమావేశమయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన గులాంనబీ అజాద్ చాంబర్‌లో భేటీ జరుగుతోంది. ఇప్పటికే కశ్మీర్ అంశంపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదాతీర్మానం నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీలు గులాంనబీ అజాద్, ఆనంద్‌శర్మ, అంబికాసోనీ, భువనేశ్వర్ కలిత ఈ నోటీసులపై సంతకాలు చేశారు.