Jammu And Kashmir: బ్రేకింగ్... జమ్మూ కశ్మీర్ కొత్త గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్?

  • ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా నరసింహన్
  • గతంలో హోమ్ శాఖలోనూ పనిచేసిన అనుభవం
  • ఇంకా వెలువడని అధికారిక ఉత్తర్వులు

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలపై నేడు కేంద్రం కీలక ప్రకటన చేస్తుందన్న వార్తలు వస్తున్న వేళ, ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా గతంలో తెలుగు రాష్ట్రాలకు, ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా పనిచేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను నియమించ వచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి గవర్నర్ గా పని చేస్తున్న ఆయన, గతంలో కేంద్ర సర్వీసుల్లోనూ విధులు నిర్వహించారు. హోమ్ శాఖలోనూ పనిచేశారు. శాంతిభద్రతల అంశంపై ఆయనకు ఉన్న పట్టు కారణంగానే కశ్మీర్ గవర్నర్ గా ఆయన పేరును ఖరారు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపేట్టుగా చేసిందని తెలుస్తోంది. ఆయన నియామకంపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.

Jammu And Kashmir
Narasimhan
New Governer
Home Ministry
  • Loading...

More Telugu News