imran khan: పాక్ జర్నలిస్టుపై వెయ్యి కోట్లకు పరువునష్టం దావా నోటీసు పంపిన ప్రధాని ఇమ్రాన్

  • ఇమ్రాన్ వ్యక్తిగత జీవితంపై యాంకర్ ఆరోపణలు
  • యాంకర్‌కు నోటీసులు పంపిన ఇమ్రాన్ తరపు న్యాయవాది
  • వెయ్యి కోట్లు చెల్లించకుంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని హెచ్చరిక

తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ నజామ్ సేథీపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రూ.1000 కోట్లకు పరువునష్టం నోటీసు పంపారు. ఈ మేరకు ఇమ్రాన్ తరపు న్యాయవాది బాబర్‌ అవాన్‌ యాంకర్‌కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. సేథీపై కనికరం చూపబోమన్నారు.

ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రజా సంబంధాల ముఖ్య అధికారి అస్ఘర్ లెఘరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితంపై సేథీ అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. నీతి నియమాలను, చట్టాన్ని ఉల్లంఘించి మరీ ప్రధానిపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రధాని పరువుకు నష్టం వాటిల్లేలా ఆయన చేసిన ఆరోపణలకు గాను వెయ్యికోట్లు చెల్లించకుంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని సేథీని హెచ్చరించారు.

imran khan
Pakistan
TV anchor
Najam Sethi
defamation
  • Loading...

More Telugu News