Hero Moto: ఇక హీరో బైకుల హోమ్ డెలివరీ!

  • అతి త్వరలో ఆన్ లైన్ సేవలు
  • తక్కువ చార్జీలతో హోమ్ డెలివరీ
  • 25 నగరాలకు విస్తరిస్తామన్న సంస్థ 

అతి త్వరలో హైదరాబాద్ లోనూ ఆన్ లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్లను విక్రయిస్తున్న ప్రముఖ సంస్థ హీరో మోటో వెల్లడించింది. హీరో బైక్ లను కొనుగోలు చేసేవారికి హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. హోమ్ డెలివరీ కోసం అతి తక్కువ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో హీరో మోటో హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 25 నగరాలకు ఆన్ లైన్ సేవలను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది.

Hero Moto
Home Delivary
Online
  • Loading...

More Telugu News