america: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జిల్లా యువకుడి మృతి

  • ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వివేక్
  • షార్లెట్‌‌లో పెట్రోలు బంకులో పనిచేస్తున్న విద్యార్థి
  • విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన

అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా మిరియం గంగనపల్లెకు చెందిన పత్తిపాటి వివేక్ (24) దుర్మరణం పాలయ్యాడు. ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన వివేక్ నార్త్ కరోలిన యూనివర్సిటీలో చదువుతూ షార్లెట్‌లోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి పెట్రోలు బంకులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం వివేక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివేక్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి రానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  

america
Chittoor District
Road Accident
pathipati vivek
  • Loading...

More Telugu News