Wolf: తోడేలు అంటే చాలా ఇష్టం... పచ్చబొట్టుపై వివరణ ఇచ్చిన టీమిండియా సెన్సేషన్ సైనీ

  • బాల్యంలో తోడేళ్ల కథాంశంతో ఉన్న సినిమాలు ఎక్కువగా చూసేవాడ్నని చెప్పిన సైనీ
  • అందుకే తోడేలు పచ్చబొట్టు వేయించుకున్నానంటూ వెల్లడి
  • విండీస్ తో మ్యాచ్ లో అదరగొట్టిన ఫాస్ట్ బౌలర్

ఇప్పుడు టీమిండియాలో నయా సంచలనం అంటే నవదీప్ సైనీ అనే చెప్పాలి. ఈ యువ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ తో తొలి టీ20లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. సైనీ స్పీడ్ కు విండీస్ బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేకపోయింది. పొలార్డ్ అంతటివాడు కూడా సైనీ విసిరిన ఓ ఓవర్లో ఒక్క పరుగూ తీయలేక చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా, మ్యాచ్ ముగిశాక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ తరఫున సైనీని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా సైనీ చేతిపై ఉన్న తోడేలు పచ్చబొట్టు గురించి అడిగాడు. చిన్నప్పుడు తాను ఎక్కువగా తోడేలు నేపథ్యం ఉండే సినిమాలు ఎక్కువగా చూసేవాడ్నని, అందుకే విభిన్నంగా ఉంటుందని తోడేలు పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపాడు.

అరంగేట్రం గురించి చెబుతూ, మ్యాచ్ కు ముందు టీమిండియా టోపీ అందుకుంటున్నప్పుడు నమ్మలేకపోయానని అన్నాడు. తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి లోనయ్యానని, మొదటి వికెట్ తీశాక ఆ ఒత్తిడి మొత్తం తొలగిపోయిందని తెలిపాడు.

Wolf
Navdeep Saini
Cricket
India
Tattoo
  • Error fetching data: Network response was not ok

More Telugu News