Jammu And Kashmir: ఢిల్లీ చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు

  • కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు
  • విద్యార్థులు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం సూచన
  • కేటీఆర్ కు సమాచారం అందించిన తెలుగు విద్యార్థులు

కశ్మీర్ లో ఉద్రిక్తత కారణంగా విద్యార్థులను సైతం హాస్టళ్లను వీడి వెళ్లాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. తాము కశ్మీర్ నుంచి వచ్చేసేందుకు సాయం చేయాలంటూ వారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేయగా, ఆయన వెంటనే ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను అప్రమత్తం చేశారు.

ఈ నేపథ్యంలోశ్రీనగర్ నుంచి తెలుగు విద్యార్థులను రైలు ద్వారా ఢిల్లీ తరలించారు. మొదటి విడతలో 31 మంది తెలుగు విద్యార్థులు అండమాన్ ఎక్స్ ప్రెస్ ద్వారా శ్రీనగర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వారికి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ భవన్ అధికారులు విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. కాగా, మరో 90 మంది తెలుగు విద్యార్థులు ఈ ఉదయం జమ్మూ నుంచి ఢిల్లీ బయల్దేరారు.

  • Loading...

More Telugu News