Home minister: అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం

  • జమ్ముకశ్మీర్, ఎల్ ఓసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న అజిత్ దోవల్, రాజీవ్ గవుబా
  • రేపు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గవుబ పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి, ఎల్ ఓసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, అమర్ నాథ్ యాత్ర నిలిపివేత, కశ్మీర్ కు అదనపు బలగాల తరలింపు అంశంపై రేపు పార్లమెంటులో ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో అమితిషా చర్చిస్తారని తెలుస్తోంది.

Home minister
Amit Shah
Bjp
Ajit Dhoval
Rajiv
  • Loading...

More Telugu News