Dayton shooting: అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ.. 9 మంది దుర్మరణం, 16 మందికి తీవ్రగాయాలు!

  • ఒహాయో రాష్ట్రంలోని డేటన్ లో ఘటన
  • బార్ పై కాల్పులు జరిపిన ఓ ఉన్మాది
  • దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు

అమెరికాలోని ఎల్ పాసోలో ఓ ఉన్మాది 20 మందిని కాల్చిచంపిన ఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ పట్టణంలో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో 9 మంది దుర్మరణం చెందారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. డేటన్ పట్టణంలోని నెడ్ పెప్పర్స్ బార్ వద్దకు  ఓ ఆగంతకుడు నిన్న అర్థరాత్రి దాటాక 1.20 గంటల సమయంలో వచ్చాడు. అయితే ఈ సందర్భంగా బార్ లోకి వెళ్లకుండా కొందరు అతడిని అడ్డుకున్నారు.

దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యక్తి తుపాకీ తీసి ఇష్టానుసారం కాల్పులు జరిపాడు. దీంతో బార్ లోని కస్టమర్లు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చిచంపారు. కాగా, ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 16 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని పోలీసులు అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా, నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందనీ, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని డేటన్ పోలీసులు చెప్పారు.

Dayton shooting
Nine killed and 16 injured
gunman opens fire
outside bar
Ohio
USA
  • Loading...

More Telugu News