Andhra Pradesh: వరద బాధితులకు అండగా నిలవండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు!

  • సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనండి
  • ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు
  • ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలను కోరారు.

ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు స్వచ్ఛమైన తాగునీరు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా మిర్చి, అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయనీ, తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు మార్గాల్లో రోడ్లు తెగిపోయి రవాణా స్తంభించిపోయిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Flood victims
party workers
  • Loading...

More Telugu News