Andhra Pradesh: మృత్యు లోగిళ్లుగా మారిన నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలి!: విజయసాయిరెడ్డి
- హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం
- గతేడాది 79 మంది విద్యార్థులు చనిపోయారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో ఆత్మహత్యలపై తక్షణం విచారణ చేపట్టాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. పీయూసీఎల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ అహ్మద్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
తాజాగా హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్వాగతించారు. గతేడాది చదువుల ఒత్తిడి కారణంగా 79 మంది విద్యార్థులు చనిపోయారనీ, దీనిపైనే హైకోర్టు స్పందించిందని అన్నారు. మృత్యు లోగిళ్లుగా మారిన ఈ రెండు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.