Andhra Pradesh: చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు బయటకువస్తాయి!: విజయసాయిరెడ్డి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-568b95765659be89b352f030f9c27fd696068447.jpg)
- సానా సతీష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది
- చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ ఆయన్ను కలుసుకున్నారు
- టీడీపీ అధినేత పాత్రపై విచారణ జరపాలి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఇటీవల మనీలాండరింగ్ దళారీ సానా సతీష్ ను సీబీఐ అరెస్ట్ చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ దుబాయ్ లోని ఓ హోటల్ లో సానా సతీష్ తో సమావేశమైనట్లు విచారణలో తేలినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ భేటీ వెనుక చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.