Jammu And Kashmir: కశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండండి...తమ పౌరులకు బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా సూచన

  • తాజా పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచన
  • అధికారుల సలహాలు పాటించండి
  • అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సలహా

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఉన్న బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా పౌరులు సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశ అధికారులు తమ పౌరులకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారెవరూ రాష్ట్రం సందర్శనకు వెళ్లవద్దని హెచ్చరించారు. వేర్వేరు కారణాలతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో చిక్కుకున్న పౌరులు సదా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్కడి అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఆ మేరకు నడుచుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలో అదనపు బలగాల మోహరింపు, అమర్‌నాథ్‌ యాత్రీకులను తిరిగి వచ్చేయాలని ప్రభుత్వం కోరడం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

Jammu And Kashmir
tension
germany briton australia
  • Loading...

More Telugu News