Uttar Pradesh: ఉన్నావో అత్యాచార బాధితురాలికి న్యూమోనియా.. పరిస్థితి విషమం!

  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితురాలు
  • వెంటిలేటర్‌పై చికిత్స
  • న్యాయవాది పరిస్థితి కూడా విషమంగానే..

కారులో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉన్నావో అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె న్యూమోనియాతో బాధపడుతోందని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో ఆమెతోపాటు గాయపడిన న్యాయవాదికి వెంటిలేటర్ తొలగించామని, అయినప్పటికీ ఆయన ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడినట్టు కాదని చెప్పారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను శనివారం సీతాపూర్ జైలులో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కారు ప్రమాదం వెనక ఆయన హస్తంపై పలు ప్రశ్నలు సంధించారు. ఇంకోవైపు, దర్యాప్తులో భాగంగా నలుగురు అధికారులతో కూడిన సీబీఐకి చెందిన మరో బృందం బాధితురాలి స్వగ్రామాన్ని సందర్శించింది.

Uttar Pradesh
Unnao
rape case
BJP
kuldeep singh
  • Loading...

More Telugu News