Kurnool District: కుమారులకు వత్తాసు పలుకుతున్న భార్య.. నరికి చంపిన భర్త

  • కర్నూలు జిల్లాలో ఘటన
  • కుమారులకు మద్దతు పలుకుతుండడంతో కక్ష
  • నిద్రిస్తున్న వేళ గొడ్డలితో నరికి చంపిన వైనం

భార్య తనకు కాకుండా కుమారులకు మద్దతుగా నిలుస్తోందన్న అక్కసుతో ఆమెను హతమార్చాడో కిరాతకుడు. ఆమె గాఢ నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపాడు. కర్నూలు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరుకు చెందిన దాసరి తులసీదాస్ (74), పద్మావతి (64) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. వీరికి 30 ఎకరాల పొలం ఉండగా అందులో 27 ఎకరాలను ముగ్గురికీ సమానంగా పంచారు. మిగిలిన మూడెకరాలను తమకే కౌలుకు ఇవ్వాలని కుమారులు కోరారు.

అందుకు తండ్రి నిరాకరించాడు. అయితే, తల్లి అండతో కుమారులే ఆ పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. దీంతో భార్యపై తులసీదాస్ కోపం పెంచుకున్నాడు. అన్ని విషయాల్లోనూ ఆమె తనకు కాకుండా కుమారులకే వత్తాసు పలుకుతోందని కక్షతో రగలిపోయాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. శుక్రవారం రాత్రి ఆమె ఆదమరిచి నిద్రిస్తున్న వేళ గొడ్డలితో దాడి చేసి నరికి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Kurnool District
murder
wife
arrest
Crime News
  • Loading...

More Telugu News