Jana Sena: బీజేపీ తీర్థం పుచ్చుకున్న కావలి నియోజకవర్గ జనసేన కీలక నేత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f55bd245322716da3e9028810c2757f0e05b3602.jpg)
- ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన పసుపులేటి సుధాకర్
- కావలిలో బీజేపీ బలపడుతుందని ఆశ
- జనసేనకు ఎదురుదెబ్బ
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ అధినేత పసుపులేటి సుధాకర్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు సమక్షంలో ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆర్థికంగా బలమైన సుధాకర్ బీజేపీలో చేరడంతో కావలి నియోజకవర్గంలో బీజేపీ బలపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, జనసేనలో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం జనసేనకు పెద్ద దెబ్బేనని చెబుతున్నారు.