Gujarath: వరద బాధితుల కడుపు నింపిన క్రికెట్ బ్రదర్స్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2f989dc6dec299751707923e7db43e9ed74a01d5.jpeg)
- గుజరాత్ లో భారీ వర్షాలు
- వడోదరాలో వరదలు
- చలించిపోయిన పఠాన్ సోదరులు
ప్రముఖ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ గుజరాత్ వరద బాధితుల పట్ల స్పందించారు. గుజరాత్ ను గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వడోదర నగరం పూర్తిగా జలమయమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం తినడానికి తిండిలేక ఎంతోమంది అల్లాడుతున్నారని గ్రహించిన యూసుఫ్ పఠాన్ వరద బాధితుల కోసం భారీగా ఆహారం సిద్ధం చేయించి స్వయంగా వడ్డించి వారి ఆకలి తీర్చారు. మరోవైపు, యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ కూడా ఓ బాలికల హాస్టల్ లో అమ్మాయిలు తిండిలేక అలమటించిపోతున్నారని తెలుసుకుని చలించిపోయాడు. ఓ అభిమాని చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించి తన బృందం సాయంతో ఆ హాస్టల్ కు వెళ్లి బాలికల కడుపు నింపాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a5a495da90e60e0b3b23501d740b181d077894bd.jpeg)