Andhra Pradesh: టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. సీఎం జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్!: కొడాలి నాని హెచ్చరిక

  • జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు
  • పోలవరంలో అవినీతి మొత్తాన్ని బయటపెడతాం
  • దేవినేని ఉమ సొంత వదిననే చంపించాడు

పోలవరం ప్రాజెక్టు, ఇతర పథకాలు అమలవుతున్న తీరుపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలిపారు. సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతిని వెలికితీసి చంద్రబాబు బండారాన్ని బయటపెడతామని అన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. సొంత వదిననే చంపించిన దేవినేని ఉమ తమపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం జగన్ ను ఇకపై ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
devineni uma
Kodali Nani
YSRCP
WARNING
  • Loading...

More Telugu News