Andhra Pradesh: ఏం చేస్తాడని అవినీతిపరుడ్ని గెలిపించారు?: ఏపీ ప్రజలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం

  •  
  • ఇంకా జగన్ కు అవినీతి బురద ఉంది
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కావడంపై వర్ల రామయ్య ఏపీ ప్రజలను నిలదీశారు. విజయవాడలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం చేస్తాడని అవినీతిపరుడైన జగన్ కు ఓటు వేసి గెలిపించారని రాష్ట్ర ప్రజలను టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా ఏ1, ఏ2లకు అధికారం అప్పగించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఏపీ ప్రజలకే దక్కుతుంది.

ఈ 11 కేసులు అయిపోయాక నిర్దోషిగా బయటకు వస్తే ఓటేశాం అని చెబితే ఓ అర్థం ఉండేది. కానీ నీ(జగన్) బురద అలాగే ఉంది. నువ్వు జైలుకు పోతావా? లేక బయట ప్రపంచంలో ఉంటావా? అని తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏ3 సెర్బియాలో అరెస్ట్ అయితే, ఏ2(విజయసాయిరెడ్డి) ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఏ1 విదేశీ యాత్ర చేస్తున్నారు’ అని చురకలు అంటించారు.

Andhra Pradesh
Telugudesam
varla ramaiah
Ap people
Jagan
YSRCP
  • Loading...

More Telugu News