Jagan: ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • ఇటీవలే ఏపీ గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న హరిచందన్
  • ట్విట్టర్ లో విషెస్ తెలియజేసిన సీఎం జగన్

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం జగన్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. "గౌరవనీయ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారూ, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని కోరుకుంటున్నాను" అంటూ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి జెరూసలెం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఎల్లుండి రాష్ట్రానికి చేరుకునే అవకాశాలున్నాయి.

Jagan
Andhra Pradesh
Biswabhushan Harichandan
Governor
  • Loading...

More Telugu News