Telugudesam: టీడీపీ నేతలపై కత్తులతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

  • నెల్లూరు జిల్లా కొట్టాలు గ్రామంలో ఉద్రిక్తత
  • పుట్టా సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన వైసీపీ
  • గాయపడ్డ పుట్టాను ఆసుపత్రికి తరలించిన టీడీపీ శ్రేణులు

ఏపీలో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, నెల్లూరు జిల్లాలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలులో టీడీపీ నేత పుట్టా సుబ్రహ్మణ్యంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాడ్ లు, కర్రలతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించాయి. దాడి నేపథ్యంలో, ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Telugudesam
YSRCP
Attack
Nellore District
Putta Subrahmanyam
  • Loading...

More Telugu News