Andhra Pradesh: పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు ఉమా?: విజయసాయిరెడ్డి

  • ఈ కాంట్రాక్టులను తమ బినామీలకు అప్పగించారు
  • వేలకోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారు
  • ఇప్పుడిదంతా వారికి పులివెందుల పంచాయతీలా కనిపిస్తుంది

టీడీపీ నేత, ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని ఏపీ ప్రభుత్వం చెబితే దేవినేని ఉమ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పనులను తమ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించిన టీడీపీ నేతలు వేలకోట్ల రూపాయల కమిషన్ ను దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో ఈ వ్యవహారమంతా టీడీపీ నేతలకు పులివెందుల పంచాయతీలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమిషన్లు దండుకున్నారు కదా. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా?’ అని నిలదీశారు.

Andhra Pradesh
Telugudesam
Devineni uma
YSRCP
Vijay Sai Reddy
Twitter
Polavaram project
Corruption
  • Loading...

More Telugu News