DK Shivakumar: నాకు ఎలాంటి పదవి వద్దు.. డీకే శివకుమార్ స్పష్టీకరణ!

  • ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ పడుతున్నారంటూ వార్తలు 
  • సామాన్య కార్యకర్తగానే ఉంటా
  • దినేశ్ గుండూరావ్ బాగా పని చేస్తున్నారన్న డీకే

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ ప్రతిపక్ష నేత పదవికి పోటీ పడుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు. తనకు ఎలాంటి పదవి వద్దని, సామాన్య కార్యకర్తగానే పని చేస్తానని చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడిగా దినేశ్ గుండూరావ్ సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిపక్ష నేత పదవిని నిర్వహించేందుకు పార్టీలో ఉన్న తనకంటే సీనియర్లు అర్హులని చెప్పారు. కొంత కాలం పాటు అన్ని పదవులకూ దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.

రెబెల్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళికి గుణపాఠం చెప్పాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయన తీర్మానించుకున్నట్టు సమాచారం.

DK Shivakumar
Karnataka
Congress
  • Loading...

More Telugu News