Andhra Pradesh: నేడు ఏపీ గవర్నర్ పుట్టిన రోజు.. రాజ్‌భవన్‌లో వేడుకలు

  • నేడు 86వ పడిలోకి గవర్నర్
  • ఆశీర్వచనం అందించనున్న వేద పండితులు
  • గిరిజన, దళిత చిన్నారుల మధ్య బర్త్ డే

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నేడు ఆయన జన్మదిన వేడుకలను రాజ్‌భవన్‌లో గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరుపుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఆయనకు టీటీడీ, కనకదుర్గమ్మ దేవస్థాన పండితులు ఆశీర్వచనం అందించనున్నారు.

అనంతరం గవర్నర్ కేక్ కట్‌చేసి చిన్నారులకు కొత్త బట్టలు, పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉండడంతో ప్రభుత్వం తరపున మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు.

Andhra Pradesh
bishwabhushan harichandan
birthday
  • Loading...

More Telugu News