britannia industries: కృష్ణా జిల్లాలోని బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కోట్ల ఆస్తి నష్టం!

  • ఈ తెల్లవారుజామున గోదాములో చెలరేగిన మంటలు
  • అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానం

కృష్ణా జిల్లాలోని కొణతనపాడులో ఉన్న బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ గోదాములో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగసి పడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనలో దాదాపు పది కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

britannia industries
Krishna District
Konatalapadu
Fire Accident
  • Loading...

More Telugu News