Q-Net: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతికి ‘క్యూనెట్’ కారణమనడం అవాస్తవం: ‘క్యూనెట్’ సౌత్ ఏషియా రీజనల్ డైరెక్టర్

  • ‘క్యూనెట్’లో పెట్టుబడిపెట్టిన టెక్కీ అరవింద్
  •  రెండురోజుల క్రితం ఆత్మహత్య
  • ఈ ఘటనపై స్పందించిన రీజనల్ డైరెక్టర్ రిషి

క్యూనెట్ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరవింద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ‘క్యూనెట్’ సౌత్ ఏషియా రీజనల్ డైరెక్టర్ రిషి స్పందించారు. అరవింద్ మృతికి ‘క్యూనెట్’ కారణమనడం అవాస్తవమని, అతని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మాదాపూర్ లో నివసిస్తున్న అరవింద్ కొన్ని నెలల క్రితం క్యూనెట్ సంస్థలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం దక్కకపోవడంతో మనస్తాపం చెందాడు. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.  

Q-Net
South Asia Regional director
Rishi
  • Loading...

More Telugu News