India: ఏదో ఒకరోజు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తా: గంగూలీ

  • టీమిండియా కోచ్ పదవిపై గంగూలీ ఆసక్తి 
  • వరల్డ్ కప్ అనంతరం కోచ్ పదవికి నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ
  • ప్రస్తుతం తనకు పోటీ చేసే అవకాశం లేదన్న గంగూలీ

టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కోచ్ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. వరల్డ్ కప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో, ఏదో ఒకరోజు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని గంగూలీ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్, బెంగాల్ క్రికెట్ సంఘం, కామెంటరీ... ఇలా పలు బాధ్యతలతో బిజీగా ఉన్నానని, మున్ముందు మాత్రం తప్పకుండా టీమిండియా కోచ్ పదవి కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.  ప్రస్తుతం తనకు కోచ్ పదవికి పోటీపడే అవకాశం లేదని వెల్లడించాడు.

బీసీసీఐ కొంతకాలం కిందట ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ పదవుల్లో కొనసాగడంపై ఆంక్షలు విధించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన తీసుకువస్తూ, ఏదో ఒక పదవిలోనే కొనసాగాలంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు గంగూలీకి కూడా ఆ నిబంధనే అడ్డొస్తోంది.

India
Sourav Ganguly
Cricket
Coach
  • Loading...

More Telugu News