Amit shah: కేంద్ర మంత్రులను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • టీటీడీ చైర్మన్ హోదాలో తొలిసారిగా ఢిల్లీ పర్యటన
  • అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లను కలిసిన వైవీ సుబ్బారెడ్డి
  • ఏపీ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి

ఢిల్లీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యటించారు. టీటీడీ చైర్మన్ హోదాలో తొలిసారిగా కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని వారికి అందజేశారు. ఏపీ అభివృద్ధికి తోడ్పడాలని, విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని మంత్రులకు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 

Amit shah
Rajnath singh
TTD
YV subba reddy
  • Loading...

More Telugu News