congress: ముస్లిం మహిళలపై ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!

  • ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయమై చర్చ
  • ముంబై, కోల్ కతాల్లోని వేశ్యా గృహాల్లో ముస్లిం మహిళల సంఖ్యే ఎక్కువ: బిష్ణు సేథీ
  • ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు

ముస్లిం మహిళలపై ఒడిశాకు చెందిన బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయమై ఒడిశా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిష్ణు సేథీ మాట్లాడుతూ, ముంబై, కోల్ కతాల్లోని వేశ్యా గృహాల్లో ముస్లిం మహిళలు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేడీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత జీరో అవర్ లో సేథీ స్పందిస్తూ, ముంబై, కోల్ కతాలోని రెడ్ లైట్ ఏరియాలో ముస్లిం మహిళలే ఎక్కువగా ఉన్నారన్న విషయాన్ని వార్తాపత్రికలు, మేగజైన్ల సర్వేలో వెల్లడైందని, ఆ విషయాన్ని ప్రస్తావించాను తప్ప, తానేమీ తక్కువ చేసి మాట్లాడలేదని సమర్థించుకున్నారు. మైనార్టీల ఓట్ల కోసమే ట్రిపుల్ తలాక్ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించిందని అన్నారు. కాగా, ఒడిశాలోని ధామ్ నగర్ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బిష్ణు సేథీ. కవి, రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

  • Loading...

More Telugu News